Dog In IIFA Awards: ఐఫా వేడుకులకు అనుకోని అతిథి, ఇంటర్యూ చేసిన నటి ఆదితి భాటియా, వైరల్ అవుతున్న వీడియో, ఇంటర్యూలో ఏం అడిగిందంటే..

ఈ వీడియోని రెండు రోజుల్లో ఏడు లక్షల మందికి పైగా చూశారు. అతిది చెప్పేది చక్కగా వింటూ ఎంత పద్ధతిగా ఉందో అంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Dog In IIFA Awards: ఐఫా వేడుకులకు అనుకోని అతిథి, ఇంటర్యూ చేసిన నటి ఆదితి భాటియా, వైరల్ అవుతున్న వీడియో, ఇంటర్యూలో ఏం అడిగిందంటే..
Dog attending 2019 IIFA Awards video goes viral

Mumbai,September 23: ఆర్థిక రాజధాని ముంబైలో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ ( International Indian Film Academy Awards) 2019 వేడుకలు ఘనంగా ముగిశాయి. వెలుగు జిలుగుల వేదికపై విస్తుగొలిపే ఏర్పాట్లతో ఈ ఐఫా 2019 (IIFA)వేడుక ఆద్యంతం పండుగ వాతావరణాన్ని తలపించింది. చాలా మంది కళాకారులు పలు కేటగిరీల్లో పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. ఆనందోత్సాహాల మధ్య పూర్తైన ఈ వేడుకల్లో ఓ ప్రత్యేక చోటుచేసుకుంది. ఈ వేడుకలకు అనుకోకుండా ఓ గెస్ట్ ఓ కుక్క వచ్చింది. ఆ కుక్కను ప్రముఖ నటి..మోడల్ అదితి భాటియా ఇంటర్వ్యూ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఆ కుక్కను చూసిన నటి అదితి భాటియాకు ఓ ఐడియా వచ్చింది. ఆ కుక్కతో ఇంటర్యూ ప్లాన్ చేసింది. హాయ్..ఇక్కడకు అనుకోకుండా ఓ స్పెషల్ గెస్ట్ వచ్చారు. తనను ఇంటర్వ్యూ చేసి బోలెడు విషయాలు తెలుసుకుందాం.. అంటూ అదితి భాటియా కుక్కను రకరకాల ప్రశ్నలు అడిగింది. ఆ కుక్క కూడా ఏమాత్రం బెదరలేదు..చక్కగా భాటియాకు తన ముందు రెండు కాళ్లతో షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఈ వీడియోను అదితి తన ఇన్ స్ట్రా గ్రామ్ లో పోస్ట్ చేశారు. అది వైరల్ గా మారింది.

 

 

View this post on Instagram

 

Spread love! 🐶❤️

A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) on

ఈ వీడియోని రెండు రోజుల్లో ఏడు లక్షల మందికి పైగా చూశారు. అతిది చెప్పేది చక్కగా వింటూ ఎంత పద్ధతిగా ఉందో అంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఓ నెటిజన్ ... ఆ కుక్క సార్ కాదనీ... మేడమ్ అని కామెంట్ చేశారు. ఇంతకంటే క్యూటర్ వీడియో ఉంటుందా అని మరో నెటిజన్ ప్రశ్నించారు. మరికొందరు బహుశా అవార్డు అందుకోవటానికి వచ్చిందేమో.. అంటూ ఛలోక్తులు విసురుతున్నారు.

(The above story first appeared on LatestLY on Sep 23, 2019 02:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).