Morbi bridge collapse Update: మృత్యు వంతెన... గుజరాత్‌లోని మోర్బీ వంతెన కూలిన ప్రమాదంలో 132కు చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయ చర్యలు

గుజరాత్‌లోని మోర్బీలో ఆదివారం సాయంత్రం తెగిపోయిన కేబుల్ వంతెన ప్రమాదంలో మృతుల సంఖ్య 145 దాటింది.

Morbi bridge collapse Update: మృత్యు వంతెన... గుజరాత్‌లోని మోర్బీ వంతెన కూలిన ప్రమాదంలో 132కు చేరిన మృతుల సంఖ్య..  కొనసాగుతున్న సహాయ చర్యలు
Gujrat Morbi bridge collapse (Twitter)

Ahmadabad, October 31: గుజరాత్‌లోని (Gujarat) మోర్బీలో (Morbi) ఆదివారం సాయంత్రం తెగిపోయిన కేబుల్ వంతెన (Cable Bridge) ప్రమాదంలో మృతుల సంఖ్య 132 దాటింది. 70 మంది గాయపడినట్లు చెబుతున్నారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరిన వారు. నదిలో మిగిలిన వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు (Rescue Operations) కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో వంతెనపై పెద్ద ఎత్తున జనం ఉన్నట్లు సమాచారం. రెస్క్యూ ఆపరేషన్‌లో స్థానికులు కూడా పోలీసులకు  పరిపాలనకు సహాయం చేస్తున్నారు. NDRF  2 బృందాలు మోర్బీకి బయలుదేరాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా భారత వైమానిక దళం (IAF) గరుడ్ కమాండోల బృందాన్ని రప్పించారు.

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్.. పెరగనున్న చార్జీలు!.. చార్జీలను పెంచాలంటూ కేంద్రాన్ని కోరిన హైదరాబాద్ మెట్రో.. ఫేర్ ఫిక్స్‌ డ్ కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం.. నవంబరు 15లోగా సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రయాణికులను కోరిన కమిటీ

వందేళ్ల క్రితం నాటి ఈ బ్రిడ్జికి ఐదు రోజుల క్రితమే మరమ్మతులు చేపట్టారు. మచ్చు నదిపై నిర్మించిన ఈ వేలాడే వంతెన స్థానికంగా ఉన్న పర్యాటక ప్రాంతాలలో ఒకటి. బ్రిటిష్ కాలం నాటి ఈ బ్రిడ్జికి ఏడు నెలలపాటు మరమ్మతులు చేశారు. గుజరాతీ నూతన సంవత్సరం సందర్భంగా ఈ నెల 26న దీనిని తిరిగి తెరిచి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. నిన్న ఆదివారం కావడంతో పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అందాలను వీక్షిస్తూ ఆనందంగా గడుపుతుండగా  సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో వంతెనపై ఉన్నవారు ఒక్కసారిగా నీళ్లల్లో పడిపోయారు.

నది లోతు ఎక్కువగా ఉండడంతో పలువురు మునిగిపోయారు. ఇంకొందరు కొట్టుకుపోయారు. ఈత వచ్చిన కొందరు మాత్రం ఒడ్డుకు చేరుకున్నారు. మరికొందరు తీగలు పట్టుకుని వేలాడుతూ కనిపించారు. విషయం తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కి ఫోన్ చేసి మాట్లాడారు. వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వానికి అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు, ఈ ప్రమాదంలో మరణించిన వారికి రూ. 4 లక్షల చొప్పున ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం రూ. 2 లక్షల సాయం ప్రకటించింది. క్షతగాత్రులకు గుజరాత్ ప్రభుత్వం రూ. 50 వేల చొప్పున సాయం ప్రకటించింది.

(The above story first appeared on LatestLY on Oct 31, 2022 10:48 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).