Hyderabad Horror: హైదరాబాద్ ప్రగతినగర్ లో దారుణం.. యువకుడిని చంపి ఇన్ స్టాలో సెల్ఫీ వీడియో పోస్ట్.. పాత కక్షల నేపథ్యంలో దారుణం
హైదరాబాద్ ప్రగతినగర్ లో దారుణం జరిగింది. పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని 20 మంది కలిసి దారుణంగా హత్య చేశారు.
Hyderabad, Apr 8: హైదరాబాద్ (Hyderabad) ప్రగతినగర్ లో దారుణం జరిగింది. పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని 20 మంది కలిసి దారుణంగా హత్య చేశారు. ఎస్‌ఆర్ నగర్ లోని దాసారం బస్తీకి చెందిన తేజస్ (21) అలియాస్ సిద్ధూను హతుడిగా గుర్తించారు. గత ఏడాది స్థానికంగా జరిగిన తరుణ్ అనే వ్యక్తి హత్య కేసులో తేజస్ ఏ3 నిందితుడిగా ఉన్నాడు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ప్రగతినగర్ లోని బతుకమ్మ ఘాట్ ఎదురుగా తేజస్ నిలబడి ఉండగా.. తరుణ్ స్నేహితులు సుమారు 20 మంది ద్విచక్రవాహనాలపై వచ్చి తేజస్‌ను కత్తులతో పొడిచి చంపారు. హత్య తర్వాత నిందితులు సెల్ఫీ వీడియో (Selfie Video) ద్వారా చిత్రీకరించి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

(The above story first appeared on LatestLY on Apr 08, 2024 10:27 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

