ITR Filing 2024: ఐటీఆర్ ఫైలింగ్ చేయడానికి చివరి తేదీ జూలై 31, ఆలస్యమైతే ఎంత పెనాల్టీ పడుతుందో తెలుసుకోండి

ఆదాయపు పన్ను శాఖ వారు ITR ఫైలింగ్ గడువును చేరుకునేలా, జరిమానాలను నివారించడానికి ఇమెయిల్‌లు, SMSల ద్వారా పన్ను చెల్లింపుదారులకు రిమైండర్‌లను పంపడం ప్రారంభించింది.ఆర్థిక సంవత్సరం 2023-24కు (మదింపు ఏడాది 2024-25) సంబంధించిన ఆదాయ పన్ను రిటర్న్స్ (ఐటీఆర్)-2024 దాఖలుకు జులై 31 చివరి తేదీగా ఉంది.

ITR Filing 2024: ఐటీఆర్ ఫైలింగ్ చేయడానికి చివరి తేదీ జూలై 31, ఆలస్యమైతే ఎంత పెనాల్టీ పడుతుందో తెలుసుకోండి
ITR Filing

ఆదాయపు పన్ను శాఖ వారు ITR ఫైలింగ్ గడువును చేరుకునేలా, జరిమానాలను నివారించడానికి ఇమెయిల్‌లు, SMSల ద్వారా పన్ను చెల్లింపుదారులకు రిమైండర్‌లను పంపడం ప్రారంభించింది.ఆర్థిక సంవత్సరం 2023-24కు (మదింపు ఏడాది 2024-25) సంబంధించిన ఆదాయ పన్ను రిటర్న్స్ (ఐటీఆర్)-2024 దాఖలుకు జులై 31 చివరి తేదీగా ఉంది. డెడ్‌లైన్‌లోగా ఐటీఆర్ ఫైలింగ్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే గడువు తేదీ తర్వాత ఐటీఆర్ దాఖలు చేస్తే చెల్లింపుదారులు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. జరిమానా ఎంతనేది ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. జరిమానాతో డిసెంబర్ 31, 2024 వరకు ఐటీఆర్ దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది.

ఆర్థిక సంవత్సరం 2023-24కు (మదింపు ఏడాది2024-25) సంబంధించి నికర పన్ను విధించాల్సిన ఆదాయం రూ. 5 లక్షల కంటే ఎక్కువగా ఉంటే చెల్లింపుదారులు రూ.5000 జరిమానా విధించి ఐటీఆర్ దాఖలు చేయవచ్చు. నికర పన్ను విధించాల్సిన ఆదాయం రూ. 5 లక్షలు లేదా అంతకంటే తక్కువగా ఉంటే మాత్రం ఆలస్య ఐటీఆర్‌పై చెల్లింపుదారులు రూ.1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ టిప్స్ ఫాలో అవ్వ‌కుండా ఐటీ రిట‌ర్స్ ఫైల్ చేస్తే ఆదాయ ప‌న్ను నోటీసులు అందుకోక త‌ప్ప‌దు, ఇవి ఫాలో అయితే రిట‌ర్స్ చాలా ఈజీ

కాగా పన్ను విధించదగిన ఆదాయం బేసిక్ మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉన్న వ్యక్తులు, కేవలం రీఫండ్‌ క్లెయిమ్ కోసం ఐటీఆర్ దాఖలు చేసేవారు ఎలాంటి ఆలస్య జరిమానా చెల్లించాల్సిన అవసరం ఉండదని ఆదాయ పన్ను విభాగం నిబంధనలు చెబుతున్నాయి. ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడం తప్పనిసరి అని ఆదాయ పన్ను విభాగం నిబంధనలు చెబుతున్నాయి. లేదంటే చెల్లింపుదారులు జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు అవసరమైతే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే సకాలంలో బాధ్యతగా ఐటీఆర్ ఫైలింగ్ చేయడం మంచిదని పన్ను నిపుణులు సూచిస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Jul 17, 2024 09:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).