ICC World Test Championship 2025 Final: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ తేదీ వచ్చేసింది, తొలిసారి వేదిక కానున్న లార్డ్స్ మైదానం, పూర్తి వివరాలు ఇవే..
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ తేదీని, వేదికను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించింది. ఫైనల్ మ్యాచ్ వచ్చే ఏడాది జూన్ 11 నుంచి 15వ తేదీ వరకు లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతుందని ఐసీసీ తెలిపింది. జూన్ 16ను రిజర్వ్ డేగా ప్రకటించింది.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ తేదీని, వేదికను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించింది. ఫైనల్ మ్యాచ్ వచ్చే ఏడాది జూన్ 11 నుంచి 15వ తేదీ వరకు లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతుందని ఐసీసీ తెలిపింది. జూన్ 16ను రిజర్వ్ డేగా ప్రకటించింది. లార్డ్స్ మైదానం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు వేదిక కావడం ఇదే మొదటిసారి అవుతుంది. 2021లో సౌతాంప్టన్, 2023లో ఓవల్ వేదిక అయ్యాయి. మొదటిసారి న్యూజిలాండ్, రెండోసారి ఆస్ట్రేలియా విజయం సాధించాయి. అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ప్రపంచ U20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న ఆర్తీ, ఈ ఎడిషన్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం
ఎంతోమంది ఐసీసీ మూడో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ తేదీ కోసం ఎదురు చూస్తున్నారని ఐసీసీ సీఈవో జియోఫ్ అల్లార్డిస్ తెలిపాడు. 2025 ఎడిషన్ కోసం తేదీలను ప్రకటించినందుకు ఆనందంగా ఉందన్నాడు. టెస్ట్ క్రికెట్ కూడా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తోంది... ఆకర్షిస్తోందన్నాడు. టిక్కెట్లకు డిమాండ్ ఉంటుందని తెలిపాడు.
(The above story first appeared on LatestLY on Sep 03, 2024 09:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

