Lunar Eclipse 2024: రేపు ఈ ఏడాదిలో రెండో చంద్రగ్రహణం, మనుషుల ఆరోగ్యంపై ఇది ఎంత వరకు ప్రభావితం చూపిస్తుందో తెలుసా..?
రేపు (బుధవారం, సెప్టెంబర్ 18) చంద్రగ్రహణం కనువిందు చేయనుంది. సూర్యుడి కాంతి చందమామ మీద పడకుండా భూమి అడ్డుగా వచ్చిన సదృశ్యంలో చంద్రగ్రహణం ( Lunar Eclipse 2024) ఏర్పడుతుంది.రేపు ఏర్పడనున్న చంద్రగ్రహణం ఈ ఏడాది రెండవది.
రేపు (బుధవారం, సెప్టెంబర్ 18) చంద్రగ్రహణం కనువిందు చేయనుంది. సూర్యుడి కాంతి చందమామ మీద పడకుండా భూమి అడ్డుగా వచ్చిన సదృశ్యంలో చంద్రగ్రహణం ( Lunar Eclipse 2024) ఏర్పడుతుంది.రేపు ఏర్పడనున్న చంద్రగ్రహణం ఈ ఏడాది రెండవది. ఈ నేపథ్యంలో చంద్రగ్రహణం మనుషుల ఆరోగ్యాన్ని నిజంగా ప్రభావితం చేస్తుందా? చేస్తే ఆ ప్రభావం మనుషులపై ఎలా ఉంటుంది? అనే సందేహాలు చాలామందిలో నెలకొని ఉంటాయి.
చంద్ర గ్రహణాలు మనుషుల్లో భావోద్వేగాలను కలిగిస్తుంటాయని చాలా మంది భావిస్తుంటారు. మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని నమ్ముతుంటారు. ఇక గ్రహణం ప్రభావంతో నిద్రలో ఇబ్బందులు ఎదురవుతుంటాయని, హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని నమ్ముతుంటారు. అంతేకాదు ఋతు చక్రాలు, సంతానోత్పత్తిని కూడా చంద్రగ్రహణాలు ప్రభావితం చేస్తాయని చెబుతుంటారు. ఈ ప్రభావాల నివారణకు కొన్ని ఆయుర్వేద, సంప్రదాయ పద్దతులను జనాలను కూడా పాటిస్తుంటారు.
చంద్రగ్రహణం ప్రభావాలపై ఎవరి నమ్మకాలు ఎలా ఉన్నా కొన్ని పద్దతులు పాటించడం ఆరోగ్యానికి మేలు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆహారం, తాగునీరు విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. నీళ్లు బాగా తాగాలని, మంచి ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మనసుకు ప్రశాంతతను ఇచ్చే ధ్యానం, యోగా చేయాలని, విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రశాంతత కలిగించే కార్యక్రమాల్లో పాల్గొనాలని, ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలు వంటి స్క్రీన్లకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. మొత్తంగా విశ్రాంతి, నిద్రకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Sep 17, 2024 10:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

