Karnataka Horror: కాళ్ల పారాణి ఆరకముందే.. పెళ్లైన రోజే విగతజీవులైన నవ దంపతులు.. ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ.. భార్యను కొడవలితో నరికిన భర్త.. అనంతరం తనూ ఆత్మహత్య.. కర్ణాటకలో దారుణం

‘కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు హత్య’ అంటూ పోకిరి సినిమాలో షాయాజీ షిండే ఓ సీన్ లో డైలాగ్ చెప్తాడు. సినిమాలో ఏమో గానీ.. కర్ణాటక రాష్ట్రం కోలార్ గోల్డ్ ఫీల్డ్‌ లోని చంబరసనహళ్లి గ్రామంలో బుధవారం ఇలాంటి ఘటనే జరిగింది.

Karnataka Horror: కాళ్ల పారాణి ఆరకముందే.. పెళ్లైన రోజే విగతజీవులైన నవ దంపతులు.. ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ.. భార్యను కొడవలితో నరికిన భర్త.. అనంతరం తనూ ఆత్మహత్య.. కర్ణాటకలో దారుణం
New Couple Died (Credits: X)

Bengaluru, Aug 9: ‘కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు హత్య’ అంటూ పోకిరి (Pokiri) సినిమాలో షాయాజీ షిండే ఓ సీన్ లో డైలాగ్ చెప్తాడు. సినిమాలో ఏమో గానీ.. కర్ణాటక రాష్ట్రం (Karnataka Horror) కోలార్ గోల్డ్ ఫీల్డ్‌ లోని చంబరసనహళ్లి గ్రామంలో బుధవారం ఇలాంటి ఘటనే జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువ జంట కాళ్ల పారాణి ఆరకముందే జీవితాన్ని ముగించేసుకుంది. పెళ్లైన గంటల వ్యవధిలోనే ఘర్షణ పడి ఇద్దరూ కత్తిపోట్లకు గురై కన్నుమూశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని సంతూరుకు చెందిన నవీన్, కర్ణాటకలోని కోలార్ జిల్లా కేజీఎఫ్ తాలూకా బైనేహళ్లికి చెందిన లిఖిత గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించడంతో.. ఇరు కుటుంబాల, బంధు మిత్రుల సమక్షంలో ఈ నెల 7వ తేదీన ఇద్దరికీ వివాహం జరిగింది.

‘బ్రేక్’ థీమ్ తో వినూత్నంగా నేటి గూగుల్ డూడుల్.. దీని అర్థం తెలుసా?

ఏకాంత సమయంలో..

పెళ్లి జరిగిన రోజు సాయంత్రం.. లిఖితతో పాటు ఆమె తల్లిదండ్రులను నవీన్ తన ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ ఓ గదిలో నూతన దంపతులు కాసేపు ఏకాంతంగా గడిపారు. అయితే, ఏమైందో ఏమో గానీ.. వారి మధ్య మొదలైన ఓ వివాదం కాసేపటికే తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో లిఖితపై నవీన్ కొడవలితో దాడి చేశాడు. గదిలో నుంచి పెద్దగా అరుపులు వినపడడంతో కుటుంబ సభ్యులు తలుపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్లి చూసి నిర్ఘాంతపోయారు. లిఖిత అప్పటికే రక్తపు మడుగులో పడి మృతి చెందగా కొడవలితో తనకు తాను దాడి చేసుకొని నవీన్ కూడా కిందపడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు నవీన్‌ ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం అతడు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భారత్ ఖాతాలో మరో పతకం, కాంస్య పోరులో స్పెయిన్‌ పై భారత హాకీ జట్టు విజయం, 2-1 తేడాతో గెలిచి కాంస్యం సొంతం

(The above story first appeared on LatestLY on Aug 09, 2024 10:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).