Photo Shoot Turns Tragedy: రైల్వే బ్రిడ్జిపై దంపతుల పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్.. రైలు రావడంతో కిందికి దుకేసిన జంట.. రాజస్థాన్ లో ఘటన.. గగుర్పొడిచే వీడియో మీరూ చూడండి.
రాజస్థాన్ లోని పాలి జిల్లాలో గోరంఘాట్ బ్రిడ్జిపై ఘోరం జరిగింది. రాహుల్, జాన్వి అనే నూతన దంపతులు పోస్ట్ వెడ్డింగ్ లో భాగంగా రైల్వే బ్రిడ్జిపై ఫోటో షూట్ లో పాల్గొన్నారు.
Jaipur, July 15: ప్రమాదకరమైన ప్రాంతాల్లో సేల్ఫీలు, ఫోటో షూట్ లు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ముందూ, వెనుక ఆలోచించకుండా చేసే ఇలాంటి విచిత్ర విన్యాసాలు కొన్నిసార్లు ప్రాణాలమీదకు తీసుకొస్తాయి. ఇదీ అలాంటి ఘటనే. రాజస్థాన్ (Rajasthan) లోని పాలి జిల్లాలో గోరంఘాట్ బ్రిడ్జిపై (Train Bridge) ఘోరం జరిగింది. రాహుల్, జాన్వి అనే నూతన దంపతులు పోస్ట్ వెడ్డింగ్ లో భాగంగా రైల్వే బ్రిడ్జిపై ఫోటో షూట్ లో పాల్గొన్నారు. దంపతులు బ్రిడ్జి మధ్యలో ఉండగా అటువైపుగా ఓ రైలు వచ్చింది.
రైల్వే బ్రిడ్జిపై ఫోటోషూట్.. రైలు రావడంతో కిందికి దుకేసిన భార్యాభర్తలు
రాజస్థాన్ - పాలి జిల్లాలోని గోరంఘాట్ బ్రిడ్జిపై రాహుల్, జాన్వి అనే దంపతులు ఫోటోషూట్ చేస్తుండగా రైలు వచ్చింది.. దీంతో వారు బ్రిడ్జి మీద నుండి 90 అడుగుల లోతులోకి దూకగా రాహుల్కు వెన్నుముకకు తీవ్ర గాయమవ్వగా,… pic.twitter.com/dzfKjFqSS3
— Telugu Scribe (@TeluguScribe) July 14, 2024
ఆందోళనకు గురైన నూతన జంట
రైలు దూసుకురావడంతో ఆందోళనకు గురైన నూతన జంట బ్రిడ్జి మీద నుండి 90 అడుగుల లోతు లోయలోకి దూకేశారు. ఈ ఘటనలో రాహుల్ కు వెన్నుముకకు తీవ్ర గాయమవ్వగా, జాన్వికి కాలు విరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
(The above story first appeared on LatestLY on Jul 15, 2024 10:15 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

