Realme Narzo N61: రూ. 7 వేలకే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్, రియల్‌మీ నార్జో ఎన్61ను భారత మార్కెట్లో విడుదల చేసిన చైనీస్ దిగ్గజం

రియల్‌మీ నార్జో ఎన్61 (Realme Narzo N61) ఫోన్‌ను విపణిలోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఫోన్ 32-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్‌తోపాటు ఐపీ54 రేటెడ్ బిల్ట్ ఫర్ డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్, 6జీబీ ర్యామ్ విత్ ఒక్టాకోర్ యూనిసోక్ ప్రాజెసర్ ఉంటాయి. రెండు స్టోరేజీ వేరియంట్లలో లభిస్తున్న ఈ పోన్ విక్రయాలు ఆగస్టులో ప్రారంభం అవుతాయని కంపెనీ తెలిపింది.

Realme Narzo N61: రూ. 7 వేలకే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్, రియల్‌మీ నార్జో ఎన్61ను భారత మార్కెట్లో విడుదల చేసిన చైనీస్ దిగ్గజం
Realme Narzo N61

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ (Realme) సరికొత్త ఫోన్ ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. రియల్‌మీ నార్జో ఎన్61 (Realme Narzo N61) ఫోన్‌ను విపణిలోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఫోన్ 32-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్‌తోపాటు ఐపీ54 రేటెడ్ బిల్ట్ ఫర్ డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్, 6జీబీ ర్యామ్ విత్ ఒక్టాకోర్ యూనిసోక్ ప్రాజెసర్ ఉంటాయి. రెండు స్టోరేజీ వేరియంట్లలో లభిస్తున్న ఈ పోన్ విక్రయాలు ఆగస్టులో ప్రారంభం అవుతాయని కంపెనీ తెలిపింది.

రియల్‌మీ నార్జో ఎన్61 (Realme Narzo N61) ఫోన్‌ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.7,999, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.8,499లకు లభిస్తాయి. ఆగస్టు ఆరో తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఫస్ట్ సేల్ ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా ఫస్ట్ సేల్ లో పాల్గొనే కొనుగోలుదారులకు రూ.500 డిస్కౌంట్ కూపన్ ఆఫర్ చేస్తోంది. అమెజాన్, రియల్‌మీ ఇండియా వెబ్ సైట్ ద్వారా సేల్స్ ప్రారంభం అవుతాయి. మార్బుల్ బ్లాక్, వోయేజ్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. భారత మార్కెట్లోకి జియో మరో సంచలన 4జీ ఫోన్, రూ. 1799కే జియో భారత్ జే1 4జీ ఫీచర్ ఫోన్, ప్రత్యేకతలేంటో తెలుసుకోండి

90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 560 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తోపాటు 6.74 అంగుళాల హెచ్డీ+ (1600×720 పిక్సెల్స్) ఎల్‌సీడీ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఆర్మూర్ షెల్ ప్రొటెక్షన్, టీయూవీ రైన్ లాండ్ హై రిలయబిలిటీ సర్టిఫికెట్ కలిగి ఉంటుంది. రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ టెక్నాలజీ కూడా వినియోగించారు. యూనిసోక్ టీ612 ప్రాసెసర్ తో వస్తోంది. 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ కెపాసిటీతో వస్తోంది. 6జీబీ ర్యామ్ ను 12 జీబీ ర్యామ్ కు విస్తరించుకునే అవకాశం ఉంది. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో రెండు టిగాబైట్ల వరకూ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్ మీ యూఐ 4.0 వర్షన్ పై పని చేస్తుంది.

అలాగే 32-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, అన్ స్పెసిఫైడ్ సెకండరీ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. సమగ్ర నోటిఫికేషన్లు, అలర్ట్స్ కోసం మినీ క్యాప్సూల్ 2.0 ఫీచర్ కూడా ఉంటుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఫుల్ చార్జింగ్ తో 30 గంటల వరకూ వాయిస్ కాల్ టైం ఉంటుంది. డ్యుయల్ 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.

(The above story first appeared on LatestLY on Jul 29, 2024 10:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).