Vjy, August 21: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఎగ్ పఫ్స్" కోసం కోట్ల రూపాయల ఖర్చు చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 2019 నుండి 2024 వరకు ఐదేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం ఎగ్ పఫ్స్ కోసం రూ.3.62 కోట్లు దుర్వినియోగం చేసిందని మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ అంశం తీవ్ర దుమారం రేపుతోంది.
ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) సిబ్బంది రోజుకు సగటున 993 ఎగ్ పఫ్స్ తిన్నారనీ, దీని ఖర్చు ఏటా రూ.72 లక్షలు కాగా, మొత్తం 18 లక్షల ఎగ్ పఫ్స్ తిన్నారని వివరాలను టీడీపీ నాయకులు పేర్కొంటూ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగిందో అనే విషయాలను ప్రస్తావిస్తున్నారు. గత సర్కారు ఆర్థిక అవకతవకలపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అమరావతి నిధుల కోసం ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ, శ్రీసిటీలో 15 కంపెనీలు ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి
అధికార పార్టీ ఆరోపణలు, ప్రజల నుంచి వస్తున్న తీవ్ర విమర్శల మధ్య 'ఎగ్ పఫ్ స్కాండల్' మాజీ సీఎం జగన్, వైకాపాప్రతిష్టను దెబ్బతీసేందుకు టీడీపీ చేసిన ఉద్దేశపూర్వక ప్రయత్నమని వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎగ్ పఫ్ అంశాన్ని 'ఫేక్ న్యూస్'గా అభివర్ణించారు. 2014-2019 మధ్య మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ లకు స్నాక్స్ కోసం గత టీడీపీ ప్రభుత్వం రూ.8.5 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు.
Here's Tweets
one more dog🐕 …
as per earlier fake news spread by #TDP govt jagan have 930+ security and employees and so many visitors
every day 993
month 29790
year 3.5L
5 years 17.87 round to 18L
3.6cr for 18L puffs (20lacs)
What is wrong.
is this one is fake or security one?#TDP #YSRCP https://t.co/Mtqqvukijp
— For A Reason (@forareason_in_X) August 21, 2024
TDP's Paid Mafia Started Fake Propaganda on @ysjagan..#AndhraPradesh #FakePropaganda https://t.co/pxekr5Gr2f pic.twitter.com/6cJULyX7Hm
— 𝐘𝐒𝐉 𝐓𝐡𝐞 𝐒𝐭𝐚𝐥𝐰𝐚𝐫𝐭 (@2029YSJ) August 21, 2024
వైకాపా ఫేక్ బతుకులు ఇలా తగలడ్డాయి. జగన్ చేసిన తప్పులు, దోపిడీ కప్పిపుచ్చడానికి వైకాపా కిరాయి మూకలు ఫేక్ ప్రచారం ప్రారంభించారు.#FekuJagan#EndOfYCP#YCPFakeBrathuku #AndhraPradesh pic.twitter.com/XidENNsP3I
— Telugu Desam Party (@JaiTDP) August 20, 2024
ఇటువంటి తప్పుడు రాతలకే పరువు నష్టం దావాలు ఎదుర్కొంటున్న ఫేక్ జగన్ ఇంకా తన బుద్ధి మార్చుకోలేదు. జనం ఛీకొట్టారు, అయినా ఫేక్ చేయడం జగన్ మానలేదు.#FekuJagan#EndOfYCP#AndhraPradesh pic.twitter.com/JjMqa3F3sN
— Telugu Desam Party (@JaiTDP) August 21, 2024
వైఎస్ఆర్సీపీ ఆరోపణలను టీడీపీ వెంటనే స్పందిస్తూ.. వైసీపీ చేస్తున్న కామెంట్స్ నిరాధారమైనవి,కల్పితమైనవిగా అభివర్ణించింది. గత ప్రభుత్వ అవకతవకల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు వైఎస్ఆర్సీపీ తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తోందని టీడీపీ సోషల్ మీడియా విభాగం పేర్కొంది.