Telangana: నిర్మల్ కేంద్రంగా భారీ సెక్స్ రాకెట్ గుట్టురట్టు, పోలీసులకు దిమ్మతిరిగే షాక్, లాడ్జీపై దాడి చేయగానే...
Sex Racket Busted. (Photo Credit: PTI)

నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్‌లో గల ఓ లాడ్జిలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం చేస్తున్న ఎనిమిది మంది విటులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముందస్తు సమాచారం మేరకు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, పట్టణ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంయుక్తంగా మంగళవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వ్యభిచారం చేస్తున్న విటులతో పాటు యువతులను పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. లాడ్జిలో వ్యభిచారానికి ప్రోత్సహిస్తున్న లాడ్జి యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పట్టణ సీఐ శ్రీనివాస్ పేర్కొన్నారు.  వివరాల్లోకి వెళితే స్థానిక లాడ్జీలో గత కొన్ని రోజులుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు రాత్రి పోలీసులు దాడి చేశారు. ఒక యువతితో పాటు 8 మంది విటులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు​ తెలిపారు. ఇదిలా ఉంటే లాడ్జీలో గత కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు కొన్ని రోజులుగా నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే రాత్రి వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటి యజమాని తో పాటు 8 మంది విటులను పట్టుకుని పోలీస్​ స్టేషన్​కు తరలించారు. దర్యాప్తు సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.