Devarakonda with Prabhas: ప్రభాస్ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ?!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కల్కి 2829 AD చిత్రంతో మొదటిసారి సైన్స్ ఫిక్షన్ జోనర్ చేస్తున్నాడు. ప్రభాస్ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో కల్కి తెరకెక్కుతుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు.

Devarakonda with Prabhas: ప్రభాస్ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ?!
Devarakonda with Prabhas (Credits: X)

Hyderabad, Jan 20: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (PAN India Star Prabhas)..  కల్కి 2829 AD చిత్రంతో మొదటిసారి సైన్స్ ఫిక్షన్ జోనర్ చేస్తున్నారు. ప్రభాస్ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) దీన్ని తెరకెక్కిస్తున్నారు. కల్కి మూవీ లో భారీ స్టార్ క్యాస్ట్ నటిస్తుంది. లోకనాయకుడు కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటానితో పాటు  అమితాబ్ సైతం ఈ ప్రాజెక్ట్ లో భాగమయ్యారు. మరో క్రేజీ హీరో కల్కి మూవీలో నటిస్తున్నాడన్నది లేటెస్ట్ టాక్. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కల్కి మూవీలో గెస్ట్ రోల్ చేస్తున్నాడంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఆయన ఓ సన్నివేశంలో తళుక్కున్న మెరుస్తారట. కనిపించేది కొన్ని నిమిషాలే అయినా మంచి వెయిట్ ఉన్న రోల్ అంటున్నారు. అయితే, దీంట్లో నిజమేంటో తెలియాల్సి ఉంటుంది.

Choodu Nanna Song Out: చూడు నాన్న.. చూస్తున్నావా నాన్న, ఆకట్టుకుంటున్న యాత్ర 2 లేటెస్ట్ సాంగ్, లిరికల్ వీడియో ఇదిగో..

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 20, 2024 09:29 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).