Amitabh Bachchan Covid Positive: రెండవ సారి కరోనా బారీన పడిన అమితాబ్ బచ్చన్, తనని కలిసిన వారంత పరీక్షలు చేయించుకోవాలని ట్వీట్
అమితాబ్ బచ్చన్ మళ్లీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్ చేస్తూ.. ఇటీవల తనని కలిసిన వారంత పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇక ఆయనకు కరోనా పాజిటివ్ అని తెలిసి సినీ ప్రముఖులు, అభిమానులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేస్తున్నారు.
కాగా బిగ్‌బి ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి 14వ సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు ఆయన రష్మిక మందన్నాతో గుడ్‌బై, ఊంచాయి మూవీ షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. 2021లో అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య రాయ్‌లు కూడా కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు.
T 4388 - I have just tested CoViD + positive .. all those that have been in my vicinity and around me, please get yourself checked and tested also .. 🙏
— Amitabh Bachchan (@SrBachchan) August 23, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 24, 2022 11:00 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

