Nagarjuna on Konda Surekha Comments: నాగచైతన్య-సమంత విడాకులు, కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన హీరో నాగార్జున, మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ ట్వీట్

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తూ.. నాగచైతన్య-సమంత విడాకుల గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఆయన ట్వీట్ చేశారు.

Nagarjuna on Konda Surekha Comments: నాగచైతన్య-సమంత విడాకులు, కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన హీరో నాగార్జున, మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ ట్వీట్
Hero Nagarjuna Akkineni Reacts on Konda Surekha Comments Over Samantha-Naga Chaitanya Divorce

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తూ.. నాగచైతన్య-సమంత విడాకుల గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఆయన ట్వీట్ చేశారు. రాజకీయాలకు దూరంగా ఉండే నటీనటుల జీవితాలను ప్రత్యర్థులపై విమర్శించేందుకు వాడుకోవద్దని సూచించారు.

హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం కేటీఆర్‌కు అలవాటే, కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు, సమంత, నాగచైతన్య విడిపోవడానికి కారణం అతడే అంటూ..

ఆయన ట్వీట్ చేస్తూ.. గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నానని తెలిపారు.

Here's Tweet

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 02, 2024 06:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).