Indira Devi Passes Away: శోక సంద్రంలో సూపర్ స్టార్స్, మహేష్ బాబు తల్లి, సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి ఇందిరాదేవి కన్నుమూత
టాలీవుడ్‌లో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్‌బాబు తల్లి ఘట్టమనేని ఇందిరా దేవి(70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని నివాసంలో బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
టాలీవుడ్‌లో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్‌బాబు తల్లి ఘట్టమనేని ఇందిరా దేవి(70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని నివాసంలో బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఇందిరా దేవికి రమేష్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఐదుగురు సంతానం.
అభిమానుల సందర్శనార్థం ఇందిరా దేవీ భౌతిక కాయాన్ని పద్మాలయ స్టూడియోస్‌కి తరలిస్తారు. మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.కాగా ఈ ఏడాది జనవరిలోనే రమేశ్ బాబు(56) మృతిచెందారు. ఏడాది తిరగకముందే ఇందిరా దేవి కూడా కన్నుమూయడం కృష్ణ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. కాగా.. ఇందిరా దేవి మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు. తీవ్ర దుఃఖంలో ఉన్న కృష్ణ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు.
Superstar #Krishna Gari wife, #MaheshBabu's mother #Indira Devi Garu passed away today at 4 AM due to health related problems.
To offer final respects, her mortal remains will be at Padmalaya Studios from 9 AM - 12 PM
After that funeral will be held at Maha Prasthanam pic.twitter.com/JfamYS0uPC
— BA Raju's Team (@baraju_SuperHit) September 28, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 28, 2022 10:40 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

