రాజేంద్ర ప్రసాద్‌, నరేశ్‌ అగస్త్య, హర్ష వర్థన్‌, జ్ఞానేశ్వరి, సత్య ప్రకాశ్ కీల‌క‌ పాత్ర‌ల్లో ఓటీటీలో విడుద‌లైన‌ సేనాపతి సినిమాకు మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈ సినిమాకు నిర్మాతగా సుస్మిత కొణిదెల వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే. దర్శ‌కుడు పవన్‌ సాదినేని రూపొందించిన ఈ సినిమా రెండు రోజుల క్రితం అల్లు అర‌వింద్ కు చెంద‌ని ఓటీటీ ఆహాలో విడుద‌లైంది. ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిచారు. ఈ సినిమా చూశాన‌ని, యువ ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ ఈ సినిమాను చాలా అద్భుతంగా తీశాడ‌ని చిరంజీవి కొనియాడారు. న‌ట‌కిరీటి రాజేంద్ర ప్ర‌సాద్ఈ సినిమాలో వినూత్న పాత్ర‌లో అద్భుతంగా న‌టించార‌ని చెప్పారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)