Aishwarya Rai: చేపలు తింటే ఐశ్వర్య రాయ్ లాంటి కళ్లు వస్తాయ్.. మహారాష్ట్ర మంత్రి విజయ్‌కుమార్ గవిత్ సంచలన వ్యాఖ్యలు.. సముద్ర తీరంలో ఉండే చేపలు తినే ఐశ్వర్య అందమైన కళ్లు సొంతం చేసుకుందని వెల్లడి
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) అందమైన నీలి కళ్ల సౌందర్యానికి ఫిదా కానివారెవరూ? ఇప్పుడు ఆమె కళ్లపై మహారాష్ట్ర (Maharastra) గిరిజన శాఖ మంత్రి విజయ్‌కుమార్ గవిత్ (Vijaykumar Gavit) సంచలన వ్యాఖ్యలు చేశారు.
Newdelhi, Aug 22: మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) అందమైన నీలి కళ్ల సౌందర్యానికి ఫిదా కానివారెవరూ? ఇప్పుడు ఆమె కళ్లపై మహారాష్ట్ర (Maharastra) గిరిజన శాఖ మంత్రి విజయ్‌కుమార్ గవిత్ (Vijaykumar Gavit) సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజూ చేపలు తినేవారికి ఐశ్వర్యలాంటి సొంతమవుతాయని గవిత్ వ్యాఖ్యానించారు. నందూర్బార్ జిల్లాలో ఓ బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదంతం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ‘రోజూ చేపలు తినేవారి చర్మం నునుపుగా ఉంటుంది. కళ్లు మెరుస్తుంటాయి. అలాంటి వారిని చూసే వారు ఆకర్షణకు లోనవుతారు. నేను ఐశ్వర్యరాయ్ గురించి చెప్పనా? ఆమె మంగళూరులోని సముద్ర తీరంలో నివసించేది. దీంతో, రోజూ చేపలు తినేది. చేపలు తింటే అలాంటి కళ్లు మీ సొంతమవుతాయి’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Maharashtra's Minister of Tribal Welfare Vijaykumar Gavit said that actress Aishwarya Rai had "beautiful eyes" and "glowing skin" because of her fish-eating habit.#Maharashtra (@ritvick_ab)https://t.co/vieZxGMqF5
— IndiaToday (@IndiaToday) August 21, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 22, 2023 08:37 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

