గుప్పెడంత మనసు సీరియల్‌తో పాపులర్ అయిన బుల్లితెర నటి జ్యోతిరాయ్‌ మానవత్వాన్ని చాటుకుంటి. కష్టాల్లో ఉన్న ప‌ద్మ శ్రీ అవార్డు గ్ర‌హీత‌ ద‌ర్శ‌నం మొగిలయ్యకు రూ. 50 వేలు ఆర్థిక సాయం అందజేసింది. మొగిలయ్యను తన టీమ్‌ ద్వారా కలుసుకున్న ఆమె అక్షయ తృతీయ నాడు తన వంతుగా రూ. 50 వేలు సాయం చేసింది. ప్రస్తుతం తాను కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆమె తెలిపింది. తన ఇబ్బందుల కంటే మొగిలయ్య పరిస్థితి ఎక్కువగా కలచివేసిందని ఆమె పేర్కొంది.మొగలయ్య పాదాలకు నమస్కరించి జ్యోతిరాయ్‌ ఆశీర్వాదం తీసుకుంది. తెలంగాణకు చెందిన కిన్నెర క‌ళాకారుడు ద‌ర్శ‌నం మొగిల‌య్య కూలీ ప‌ని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి విదితమే. ప్రభుత్వం నుంచి ఆగిపోయిన గౌరవ వేతనం, పొట్ట కూటి కోసం కూలి అవతారం ఎత్తిన పద్మశ్రీ అవార్డ్ గ్రహీత మొగులయ్య

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)