Lunar New Year 2025: చాంద్రమాన నూతన సంవత్సరం(లూనార్ న్యూ ఇయర్) ..గూగుల్ డూడుల్ సెలబ్రేట్, ఏఏ దేశాల్లో జరుపుకుంటారో తెలుసా!
సందర్భానికి తగినట్లు తమ డిస్ ప్లే లో పలు చిత్రాలు, వీడియోలతో కార్టూన్ యానిమేషన్‌ని ప్రదర్శించే గూగుల్ డూడుల్(Google Doodle). ఇవాళ లూనార్ న్యూ ఇయర్(Lunar New Year 2025)ను జరుపుకుంది.
సందర్భానికి తగినట్లు తమ డిస్ ప్లే లో పలు చిత్రాలు, వీడియోలతో కార్టూన్ యానిమేషన్‌ని ప్రదర్శించే గూగుల్ డూడుల్(Google Doodle).. ఇవాళ లూనార్ న్యూ ఇయర్(Lunar New Year 2025)ను జరుపుకుంది. చాంద్రమాన క్యాలెండర్‌లో మొదటి అమావాస్యను ఆసియాలోని అనేక దేశాలలో వేడుకగా జరుపుకుంటారు. ఈ ఆచారం 3,000 సంవత్సరాలుగా అనాదిగా వస్తోంది.
తూర్పు ఆసియాలో ఎక్కువ భాగం చైనీస్ క్యాలెండర్ ఆధారంగా లూనిసోలార్ న్యూ ఇయర్‌ని(Lunar New Year ) జరుపుకుంటారు . పాశ్చాత్య ప్రపంచంలో సాధారణంగా చాంద్రమాన నూతన సంవత్సరం గా సూచిస్తారు. చైనాలో లూనార్ సంవత్సరం సందర్భంగా అధికారికంగా సెలవు దినం.
12 నెలల తర్వాత వచ్చే ఈ తొలి అమావాస్యను వేడుకగా జరుపుకుంటారు. తమ ఇంటిని శుభ్రపరిచి ఎర్ర రంగుతో అలంకరిస్తారు. ప్రజలు దీపాలను వెలిగిస్తారు. తమ కుటుంబ సభ్యులతో వేడుకగా లూనార్ ఈయర్‌ను జరుపుకుంటారు. చేప, కోడి మాంసం, ముద్దపప్పు, స్వీట్ రైస్ కేకులు, పండ్లు వంటి వివిధ రకాల వంటకాలు కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదిస్తారు.
Google Doodle celebrates Lunar New Year 2025

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 29, 2025 08:41 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

