దేశంలో గడిచిన 24 గంటల్లో 1,569 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. తాజాగా వైరస్‌తో 19 మంది మృతి చెందగా.. 24 గంటల్లో 917 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 4,31,25,370కి పెరిగింది. ఇందులో 4,25,84,710 మంది కోలుకున్నారు. మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు
5,24,260 మంది ప్రాణాలు వదిలారు. దేశంలో ప్రస్తుతం 16,400 యాక్టివ్ కేసులున్నాయని కేంద్రం చెప్పింది. జాతీయ కొవిడ్ రికవరీ రేటు 98.75శాతంగా ఉందని తెలిపింది. గడిచిన 24 గంటల్లో 10.78లక్షల కొవిడ్ టీకాలు వేయగా.. ఇప్పటి వరకు 1,91,48,94,858 డోసులు వేసినట్లు వివరించింది. నిన్న 2,97,242 కొవిడ్ టెస్టులు చేసినట్లు చెప్పింది. కొత్త కేసుల్లో దాదాపు 75శాతానికి పైగా ఐదు రాష్ట్రాల నుంచే నమోదయ్యాయని వివరించింది.
#COVID19 | India reports 1,569 fresh cases, 2,467 recoveries, and 19 deaths in the last 24 hours.
Total active cases are 16,400. Daily positivity rate (0.44%) pic.twitter.com/mQLqgVqxdg
— ANI (@ANI) May 17, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)