Covid in India: దేశంలో తగ్గేదేలే అంటున్న కరోనా, గత 24 గంటల్లో 18,930 మందికి కోవిడ్, 1,19,457 కేసులు యాక్టివ్
దేశంలో రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న పాజిటివ్ కేసులు మళ్లీ 19 వేలకు చేరువయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 18,930 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసులు 4,35,66,739కు పెరిగాయి. ఇందులో 1,19,457 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 4,29,21,977 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు.
దేశంలో రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న పాజిటివ్ కేసులు మళ్లీ 19 వేలకు చేరువయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 18,930 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసులు 4,35,66,739కు పెరిగాయి. ఇందులో 1,19,457 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 4,29,21,977 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటివరకు 5,25,305 మంది కరోనాతో మరణించారు. కొత్తగా 35 మంది మరణించగా, 14,650 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 4.32 శాతానికి చేరిందని తెలిపింది. మొత్తం కేసుల్లో 0.26 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని పేర్కొన్నది. రికవరీ రేటు 98.53 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయని చెప్పింది. ఇప్పటివరకు 198.33 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.
#COVID19 | India reports 18,930 fresh cases, 14,650 recoveries, and 35 deaths in the last 24 hours.
Active cases 1,19,457
Daily positivity rate 4.32% pic.twitter.com/cAqSEIWR0L
— ANI (@ANI) July 7, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 07, 2022 12:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

