గుండెపోటుతో పెళ్లిలోనే వరుడు మృతి చెందాడు(viral video). మధ్యప్రదేశ్ - శ్యోపుర్ జిల్లాలో పెళ్లి ఊరేగింపులో డీజే పాటలకు డాన్స్ చేసిన పెళ్లి కొడుకు ప్రదీప్ (26)(Groom dies) మండపానికి వెళ్లేందుకు గుర్రం ఎక్కాడు.

కాసేపటికే ప్రదీప్ గుండెపోటుకు గురికావడంతో సీపీఆర్ చేసి, ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా స్థానికంగా విషాదాన్ని నింపింది.

యువకుల స్టంట్...గాయాలతో బయటపడ్డారు, పాట్నాలో వైరల్‌గా మారిన వీడియో

బిహార్‌లోని పాట్నా హైవేలో యువకులకు తృటిలో ప్రమాదం తప్పింది. పాట్నా హైవేలో రెండు వాహనాల మధ్యలో నుంచి ప్రమాదకరంగా వెళ్లడానికి ప్రయత్నించారు ద్విచక్ర వాహనదారులు.దీంతో కారును ఢీకొట్టి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులకు ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Groom dies of heart attack at wedding

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)