Covid in India: మళ్లీ మొదలైన కరోనా కల్లోలం, ఒక్కసారిగా వేలల్లో పెరిగిన కేసులు, గత 24 గంటల్లో 7240 మందికి కరోనా, అత్యధికంగా మహారాష్ట్రలో 2701 కేసులు ఉండగా, కేరళలో 2271 కేసులు నమోదు
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. బుధవారం 5233 మంది పాజిటివ్‌లుగా నిర్ధారణకాగా, నేడు ఆ సంఖ్య 7240కి చేరింది. ఇది బుధవారం నాటికంటే 40 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజా కేసులతో మొత్తం బాధితులు 4,31,97,522కు చేరారు. ఇందులో 4,26,40,301 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. బుధవారం 5233 మంది పాజిటివ్‌లుగా నిర్ధారణకాగా, నేడు ఆ సంఖ్య 7240కి చేరింది. ఇది బుధవారం నాటికంటే 40 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజా కేసులతో మొత్తం బాధితులు 4,31,97,522కు చేరారు. ఇందులో 4,26,40,301 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,723 మంది మృతిచెందారని తెలిపింది. ఇక రోజువారీ కేసులు ఒక్కసారిగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా అధికమవుతున్నాయి. దేశంలో ప్రస్తుతం 32,498 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని పేర్కొన్నది. గత 24 గంటల్లో కరోనాకు ఎనిమిది మంది బలవగా, 3591 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని తెలిపింది.
కొత్తగా నమోదైన కేసుల్లో సగానికిపైగా రెండు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 2701 కేసులు ఉండగా, కేరళలో 2271, ఢిల్లీలో 564, కర్ణాటకలో 376, హర్యానాలో 247 చొప్పున నమోదయ్యాయని వెల్లడించింది. కాగా, పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 1.62కు చేరిందని ఆరోగ్య శాఖ పేర్కొన్నది. యాక్టివ్ కేసులు 0.08 శాతంగా ఉండగా, రికవరీ రేటు 98.71 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉన్నాయని ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,94,59,81,691 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని, ఇందులో బుధవారం 15,43,748 మందికి వ్యాక్సినేషన్ చేశామని తెలిపింది.
India records 7,240 new COVID19 cases in the last 24 hours; Active cases rise to 32,498 pic.twitter.com/mnXkuoRsCY
— ANI (@ANI) June 9, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 09, 2022 11:03 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

