Coronavirus in India: భారత్‌ లో కరోనా కేసులు రివర్స్, పాజిటివ్ కేసులతో పోలిస్తే పెరుగుతున్న రికవరీలు, పలు రాష్ట్రాల్లో తగ్గుతున్న కేసుల సంఖ్య

భారత్‌ (India)లో కరోనా థర్డ్ వేవ్‌ తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. కొత్త కేసుల కంటే రికవరీలు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 2,86,384 ల‌క్ష‌ల పాజిటివ్ కేసులు (Positive cases) న‌మోదు అయ్యాయి. ఇవాళ ఒక్కరోజే 573 మరణాలు (Covid Deaths)నమోదయ్యాయి. అయితే రికవరీలు మాత్రం పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 3,06,357 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Coronavirus in India: భారత్‌ లో కరోనా కేసులు రివర్స్, పాజిటివ్ కేసులతో పోలిస్తే పెరుగుతున్న రికవరీలు, పలు రాష్ట్రాల్లో తగ్గుతున్న కేసుల సంఖ్య
Coronavirus | Representational Image (Photo Credits: ANI)

New Delhi January 27: భారత్‌ (India)లో కరోనా థర్డ్ వేవ్‌ తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. కొత్త కేసుల కంటే రికవరీలు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 2,86,384 ల‌క్ష‌ల పాజిటివ్ కేసులు (Positive cases) న‌మోదు అయ్యాయి. ఇవాళ ఒక్కరోజే 573 మరణాలు (Covid Deaths)నమోదయ్యాయి. అయితే రికవరీలు మాత్రం పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 3,06,357 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

భారత్‌ లో రోజువారీ పాజిటివిటీ రేటు (Daily Positivity Rate) 19.59 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ (Central health ministry) వెల్లడించింది. ఇక యాక్టీవ్ కేసులు కూడా 22లక్షలకు చేరాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే త్వరలోనే థర్డ్ వేవ్ నుంచి బయటపడొచ్చని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా 1,63,84,39,207 కరోనా వ్యాక్సిన్‌ (Corona Vaccine) డోసులు పంపిణీ చేశామని పేర్కొన్నది.

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 27, 2022 10:13 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).