Katra Bus Accident: దైవదర్శనంకు వెళ్ళి తిరిగి వస్తున్న బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు, ఇద్దరు భక్తులు మృతి, 22 మందికి గాయాలు, జమ్మూకశ్మీర్‌లోని కత్రాలో విషాద ఘటన

జమ్మూకశ్మీర్‌లోని కత్రాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలువురు భక్తులు శ్రీమాత్ర వైష్ణోదేవిని దర్శించుకొని తిరిగి బస్సులో వస్తున్న క్రమంలో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మంటలు చెలరేగి ఇద్దరు భక్తులు మృతి చెందగా, 22 మంది భక్తులు గాయపడ్డారు.

Katra Bus Accident: దైవదర్శనంకు వెళ్ళి తిరిగి వస్తున్న బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు, ఇద్దరు భక్తులు మృతి, 22 మందికి గాయాలు, జమ్మూకశ్మీర్‌లోని కత్రాలో విషాద ఘటన
Representational image | Photo Credits: Flickr

జమ్మూకశ్మీర్‌లోని కత్రాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలువురు భక్తులు శ్రీమాత్ర వైష్ణోదేవిని దర్శించుకొని తిరిగి బస్సులో వస్తున్న క్రమంలో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మంటలు చెలరేగి ఇద్దరు భక్తులు మృతి చెందగా, 22 మంది భక్తులు గాయపడ్డారు. వారిని కత్రాలోని సీహెచ్‌సీ ఆసుపత్రికి తరలించారు. కత్రా నుంచి జమ్మూకు తిరిగి వస్తున్న సమయంలో బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. పలువురు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఇందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on May 13, 2022 05:57 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).