ఉత్తరాఖండ్ లోని లక్సర్ రైల్వే స్టేషన్ లో కదులుతున్న రైలు ఎక్కబోయిన ఓ వ్యక్తి పట్టు తప్పి పడిపోయాడు. ఓ వైపు రైలు అలా కదులుతూ ఉండగానే.. పట్టాలకు, ప్లాట్ ఫామ్ కు మధ్య పడ్డాడు. ఆ వ్యక్తిని గమనించిన ఉమ అనే మహిళా రైల్వే కానిస్టేబుల్ వేగంగా పరుగెత్తుకుని వచ్చింది. కదులుతున్న రైలు బోగీలు, రైలు మెట్లు తగలకుండా ఆ ప్రయాణికుడిని ప్లాట్ ఫామ్ కు అదిమి గట్టిగా పట్టుకుంది. నికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీని ఉత్తరాఖండ్ పోలీసు విభాగం తాజాగా ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.‘ఎక్స్’లో ఈ వీడియోను చూసిన నెటిజన్ల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ‘గుడ్ జాబ్.. ఉమకు అవార్డు దక్కాలి’ అని చాలా మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Here's Video
लक्सर रेलवे स्टेशन पर कलकत्ता-जम्मूतवी एक्सप्रेस में रेलवे स्टेशन से खाने का सामान लेकर एक यात्री चलती ट्रेन में चढ़ने लगा। इस दौरान उसका पैर फिसल गया और वह ट्रैन और प्लेटफार्म के बीच में फंस गया। जिसे महिला आरक्षी उमा ने सुरक्षित बाहर खींचकर बचा लिया।#UttarakhandPolice pic.twitter.com/1l5dFTQ3i7
— Uttarakhand Police (@uttarakhandcops) April 28, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)