Dhule Truck Accident Video: సీసీటీవీ పుటేజీ ఇదిగో, వేగంగా వెళుతూ అదుపుతప్పి కారును ఢీకొట్టిన ట్రక్కు, 10 మంది మృతి, మరో 20 మందికి గాయాలు
మహారాష్ట్రలోని ధులే జిల్లాలో మంగళవార ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
- Read in
- తెలుగు
మహారాష్ట్రలోని ధులే జిల్లాలో మంగళవార ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 10:45 గంటల సమయంలో ముంబై – ఆగ్రా హైవేపై వేగంగా దూసుకెళ్తున్న ట్రక్కు.. అదుపుతప్పి ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. దీంతో కారు రోడ్డుపక్కకు ఎగిరిపడింది. రోడ్డు పక్కన నిల్చున్న వారు కూడా గాల్లో ఎగిరిపడ్డారు. కొందరు బస్సు కోసం వెయిట్ చేస్తుండగా, కారు – ట్రక్కు వారిపైకి దూసుకెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. వీరిలో కొందరు చనిపోగా, మరికొందరు గాయపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీడియో ఇదిగో,
PTI Video
VIDEO | CCTV visuals of the accident in which at least 15 people were killed and more than 20 injured after a container truck hit four vehicles and then rammed into a hotel on the Mumbai-Agra Highway in Maharashtra's Dhule district on Tuesday. pic.twitter.com/GpgiaB9XjB
— Press Trust of India (@PTI_News) July 4, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 04, 2023 04:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

