Thaman Responds to Chiranjeevi's Praise: మీ మాటలు భగవద్గీత శ్లోకాన్ని గుర్తు చేస్తున్నాయి, చిరంజీవి వ్యాఖ్యలపై స్పందించిన ఎస్ఎస్ తమన్
అన్నయ్యా.. మీ మాటలు భగవద్గీత శ్లోకాన్ని గుర్తు చేశాయంటూ తమన్ ట్వీట్ చేశారు. "డియర్ అన్నయ్యా.. మీ మాటలు నాకు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్న భగవద్గీత శ్లోకాన్ని గుర్తుచేశాయి. ఎంత కాదనుకున్నా మనుషులం కదా.. ఒక్కోసారి ఆవేదన గుండె తలుపులు దాటి వచ్చేస్తూ ఉంటుంది.
సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ తెలుగు సినిమా విషయమై కీలక వ్యాఖ్యలు చేస్తూ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మన సినిమాల్ని మనమే చంపేసుకుంటున్నామని అభిమానులను ఉద్దేశించి తమన్ చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. మీ వ్యాఖ్యలు హృదయాల్ని తాకేలా ఉన్నాయని అన్నారు. చిరు ప్రశంసలపై తమన్ ఎక్స్ వేదికగా స్పందించారు.
అన్నయ్యా.. మీ మాటలు భగవద్గీత శ్లోకాన్ని గుర్తు చేశాయంటూ తమన్ ట్వీట్ చేశారు. "డియర్ అన్నయ్యా.. మీ మాటలు నాకు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్న భగవద్గీత శ్లోకాన్ని గుర్తుచేశాయి. ఎంత కాదనుకున్నా మనుషులం కదా.. ఒక్కోసారి ఆవేదన గుండె తలుపులు దాటి వచ్చేస్తూ ఉంటుంది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని, కళ్లు తెరిచే లోపలే చిదిమేస్తుంటే వచ్చిన బాధ అది. అర్థం చేసుకుని మీరు చెప్పిన మాటలు నాకు జీవితాంతం గుర్తుంటాయి" అని తమన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇక శుక్రవారం నాడు 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ సక్సెస్ మీట్‌లో తమన్ తెలుగు సినిమా గురించి ఎంతో ఆవేదనతో చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. విదేశాల్లో కూగా తెలుగు సినిమా గురించి మాట్లాడుతుంటే.. మనం మాత్రం మన సినిమాను తక్కువ చేసుకుంటున్నామంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Thaman Responds to Chiranjeevi's Praise:
❤️❤️❤️❤️❤️❤️❤️❤️ @KChiruTweets 🥁 ✊
డియర్ అన్నయ్యా... మీ మాటలు నాకు
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన....
అన్న భగవద్గీత శ్లోకాన్ని గుర్తు చేశాయి.
ఎంత కాదనుకున్నా మనుషులం కదా... ఒక్కోసారి ఆవేదన గుండె తలుపులు దాటి వచ్చేస్తూ ఉంటుంది.
పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని... కళ్ళు… https://t.co/Z8ueYVXFUG
— thaman S (@MusicThaman) January 18, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 18, 2025 02:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

