Andhra Pradesh: వీడియో ఇదిగో, స్కూలులో విద్యార్థిని ఆత్మహత్య, న్యాయం చేయాలంటూ పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌కి అడ్డుపడిన మృతురాలి తల్లిదండ్రులు
రాజమహేంద్రవరం విమానాశ్రయం వద్ద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పదోతరగతి విద్యార్థిని తల్లిదండ్రులు కలిశారు. ఆలమూరులో ఇటీవల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు పాఠశాల యాజమాన్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు.
రాజమహేంద్రవరం విమానాశ్రయం వద్ద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పదోతరగతి విద్యార్థిని తల్లిదండ్రులు కలిశారు. ఆలమూరులో ఇటీవల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు పాఠశాల యాజమాన్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ పవన్ కాన్వాయ్‌కి అడ్డుపడ్డారు. మధ్యాహ్నం వచ్చి మాట్లాడతానని ఆయన వారికి భరోసా ఇచ్చారు.
ఈస్ట్ గోదావరి జిల్లా చెముడు లంక గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని చెక్కపల్లి వెన్నెల, షిరిడి సాయి విద్యానికేతన్ పాఠశాలలో ఆత్మహత్య చేసుకుంది. తమ కూతురి మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమని, చనిపోయిన తమ కూతురికి న్యాయం చేయాలని చెక్కపల్లి వెన్నెల తల్లిదండ్రులు రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసి, వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నించారు. తిరుగు ప్రయాణంలో వారిని కలిసి మాట్లాడి, వారికి న్యాయం జరిగేలా చూస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లు వెన్నెల తల్లిదండ్రులు తెలిపారు.
Parents of Student Who Committed suicide trying to meet Pawan Kalyan to get justice
న్యాయం చేయాలంటూ పవన్ కళ్యాణ్‌ను కలవడానికి ప్రయత్నించిన ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు
తిరుగు ప్రయాణంలో కలుస్తానని హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్
ఈస్ట్ గోదావరి జిల్లా చెముడు లంక గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని చెక్కపల్లి వెన్నెల, షిరిడి సాయి విద్యానికేతన్… pic.twitter.com/jIZdCHxd3r
— Telugu Scribe (@TeluguScribe) November 1, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 01, 2024 02:12 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

