తమిళనాడు రాజధాని చెన్నైలోని ప్రముఖ ఐటీ కంపెనీ ఐడియాస్‌2ఐటీ కంపెనీ అభివృద్ధికి పాటుపడిన వంద మంది ఉద్యోగులను గుర్తించి.. అందరికీ ఒకేసారి మారుతి సుజూకి కంపెనీకి చెందిన కార్లను బహుమతిగా అందించింది. వారి కుటుంబ సభ్యులను పిలిచి ఓ వేడుకగా ఈ కార్లను అందజేసింది. తమిళనాడుకు చెందిన ఐడియాస్‌2ఐటీ కంపెనీ చెన్నై కేంద్రంగా పని చేస్తోంది. ఒకప్పుడు చిన్న కంపెనీగా మొదలై నేడు 500ల మంది పని చేసే స్థాయికి చేరుకుంది. అయితే పదేళ్ల కిందట ఈ కంపెనీ ప్రస్థానం మొదలైనప్పుడు.. ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యాలను కనుక చేరితే కంపెనీ లాభాలను ఉద్యోగులకు పంచి ఇస్తామంటూ ప్రకటించింది. పదేళ్ల క్రితం ఐడియాస్‌2ఐటీ కంపెనీ యాజమాన్యం ఇచ్చిన మాటను ఎట్టకేలకు కంపెనీ నిలుపుకుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)