Uttar Pradesh: తెల్లవారుజామున కుప్పకూలిన మూడంతస్తుల భవనం, ఇద్దరు మృతి, శిధిలాల నుంచి క్షేమంగా 12 మంది బయటకు..
యూపీలోని బారాబంకిలో (Barabanki) మూడంతస్తుల భవనం (Building collapse) కుప్పకూలింది. దీంతో ఇద్దరు మరణించగా, 12 మంది శిథిలాల్లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
యూపీలోని బారాబంకిలో (Barabanki) మూడంతస్తుల భవనం (Building collapse) కుప్పకూలింది. దీంతో ఇద్దరు మరణించగా, 12 మంది శిథిలాల్లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు భవనం కూలిపోయిందని జిల్లా ఎస్పీ దినేశ్ కుమార్ సింగ్ (SP Dinesh Kumar Singh) చెప్పారు. ఇప్పటివరకు 12 మందిని శిథిలాల నుంచి క్షేమంగా బయటకు తీసుకొచ్చామని, వారిని ఆస్పత్రికు తరలించామన్నారు. చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారని తెలిపారు. మరో ముగ్గురు శిథిలాల్లో చిక్కుకొని ఉండొచ్చని వెల్లడించారు. సహాయకచర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్టీఆర్‌ఎఫ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారని చెప్పారు.

Here's ANI Video
#WATCH | UP: "Around 3 am in the morning, we received information about a building collapse in Barabanki...We have rescued 12 people...we have got information that 3-4 people are likely still trapped under the debris. SDRF team is also at the spot, NDRF will arrive soon...among… pic.twitter.com/76lhQUJoIR
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 4, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 04, 2023 11:55 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

