Video: వీడియో ఇదిగో, పిల్లల కళ్లముందే రాకాసి అలల్లో కొట్టుకుపోయిన తల్లి, ముంబైలోని బాంద్రా ఫోర్టులో విషాదకర ఘటన
ముంబైలోని బాంద్రా ఫోర్టులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పిల్లల కళ్ల ముందే ఓ తల్లి అలలకు కొట్టుకుపోయింది. ముంబైలోని రబలేకు చెందిన ముకేశ్, జ్యోతి సోనార్ దంపతులు కలిసి తమ పిల్లలతో గత ఆదివారం జుహు చౌపట్టికి వెళ్లారు.
family picnic turned into a tragedy: ముంబైలోని బాంద్రా ఫోర్టులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పిల్లల కళ్ల ముందే ఓ తల్లి అలలకు కొట్టుకుపోయింది. ముంబైలోని రబలేకు చెందిన ముకేశ్, జ్యోతి సోనార్ దంపతులు కలిసి తమ పిల్లలతో గత ఆదివారం జుహు చౌపట్టికి వెళ్లారు. అక్కడ అలల ఉధృతి అధికంగా ఉండటంతో బీచ్‌లోకి అధికారులు అనుమతించలేదు. దీంతో వారు బాంద్రా ఫోర్టుకు చేరుకున్నారు. ఇక భార్యాభర్తలిద్దరూ సరదాగా అలలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
రాళ్లపై కూర్చున్న దంపతులను రాకాసి అలలు సముద్రంలోకి లాగేసుకున్నాయి. భార్యను కాపాడేందుకు ఆమె చీర పట్టుకుని లాగాడు ముకేశ్. కానీ ఆమె అలల ధాటికి కొట్టుకుపోయింది. ముకేశ్‌ను స్థానికులు కాపాడారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గాలింపులు చేపట్టగా, ఆమె మృతదేహం సోమవారం ఉదయం లభ్యమైంది.తల్లి జ్యోతి అలల ధాటికి కొట్టుకుపోతున్న సమయంలో వారికి సమీపంలో ఉన్న పిల్లలు మమ్మీ మమ్మీ అంటూ అరిచారు. తమ కళ్ల ముందే తల్లి సముద్రంలోకి కొట్టుకుపోవడాన్ని చూసి ఆ పిల్లలు తల్లడిల్లిపోయారు. వీడియో ఇదిగో..

Here's Video
This is so horrible How can a person risk their life for some videos..
The lady has swept away and lost her life in front of his kid.#bandstand #Mumbai pic.twitter.com/xMat7BGo34
— Pramod Jain (@log_kyasochenge) July 15, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 17, 2023 10:16 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

