Viral Video: వీడియో ఇదిగో, ఆడుకుంటున్న పిల్లలపైకి దూసుకొచ్చిన తాచు పామును కొరికి చంపిన పెంపుడు కుక్క, తాడు తెంపుకుని మరీ పరిగెత్తుకు వచ్చి..

ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో ఓ ఇంటిలో చోటుచేసుకున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటి యజమాని పంజాబ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం ఓ పాము తమ గార్డెన్ లోకి దూరిందని చెప్పారు. అక్కడ తన పిల్లలతో పాటు పనిమనిషి పిల్లలు ఆడుకుంటున్నారని తెలిపారు.

Viral Video: వీడియో ఇదిగో, ఆడుకుంటున్న పిల్లలపైకి దూసుకొచ్చిన తాచు పామును కొరికి చంపిన పెంపుడు కుక్క, తాడు తెంపుకుని మరీ పరిగెత్తుకు వచ్చి..
Pit Bull Saves Children By Killing King Cobra That Entered House In Uttar Pradesh

ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో ఓ ఇంటిలో చోటుచేసుకున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటి యజమాని పంజాబ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం ఓ పాము తమ గార్డెన్ లోకి దూరిందని చెప్పారు. అక్కడ తన పిల్లలతో పాటు పనిమనిషి పిల్లలు ఆడుకుంటున్నారని తెలిపారు. పామును చూసి వారంతా భయంతో కేకలు వేశారని తెలిపారు. అది విని తమ బుల్ డాగ్ జెన్నీ, తాడు తెంపుకుని మరీ పిల్లల దగ్గరికి పరుగెత్తుకు వెళ్లిందన్నారు.

ఐఫోన్ కొని పార్టీ ఇవ్వలేదని చంపేశారు, ఢిల్లీలో దారుణం, కత్తితో పొడిచి చంపేసిన స్నేహితులు

పామును నోటితో బంధించి నేలకేసి కొట్టడం మొదలుపెట్టిందని చెప్పారు. కాసేపటికి పాము చనిపోయిందని, కదలికలు లేకపోవడంతో జెన్నీ దానిని వదిలిపెట్టిందని తెలిపారు. తమ ఇంటికి పక్కనే పొలాలు ఉండడంతో తరచుగా పాములు గార్డెన్ లోకి వస్తుంటాయని అన్నారు. జెన్నీ ఇప్పటి వరకు ఓ పది పాములను ఇలాగే చంపిందని పంజాబ్ సింగ్ వివరించారు.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 25, 2024 11:24 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).