Weather Forecast: భగభగ మండిపోతున్న భానుడు, 5 రాష్ట్రాల్లో ఠారెత్తిస్తున్న ఎండలు, ఢిల్లీలో అత్యధికంగా 46 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు
భానుడు భగభగ మండిపోతున్నాడు. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ, ఢిల్లీ రాష్ట్రాల్లో మరికొన్ని రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. ఎండల్లో తిరగవద్దని వాతావరణశాఖ తన వార్నింగ్‌లో పేర్కొన్నది.
- Read in
- తెలుగు
దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ, ఢిల్లీ రాష్ట్రాల్లో మరికొన్ని రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. ఎండల్లో తిరగవద్దని వాతావరణశాఖ తన వార్నింగ్‌లో పేర్కొన్నది. అయితే మే 3వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. తీవ్రమైన ఎండల వల్ల పలు ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హర్యానాలో కరెంటు కోత అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో అత్యధికంగా 46 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. పాటియాలాలో 45.9 డిగ్రీలు, సిర్సా 45.7 డిగ్రీలు, గురుగ్రామ్ 45.6 డిగ్రీలు, జింద్ 44.7 డిగ్రీలు, అమృత్‌సర్ 44 డిగ్రీలు, చంఢీఘడ్ 42.2 డిగ్రీలు, గురుదాస్పూర్ 40.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
Heat wave conditions over Northwest & Central India during next 5 days and over East India during next 3 days and abate thereafter.
Rain/Thunderstorm accompanied with lightning/gusty winds likely to continue over Northeast India. pic.twitter.com/Ymgi2eOU4B
— India Meteorological Department (@Indiametdept) April 28, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 29, 2022 12:47 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

