Agnipath scheme: అగ్నిపథ్ ఆందోళనలతో వెనక్కు తగ్గిన కేంద్రం, కీలక నిర్ణయం ప్రకటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా..

అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా యువత భగ్గుమనడంతో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. అగ్నివీరులుగా పనిచేసిన వారికి కేంద్ర సాయుధ బలగాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని హోంశాఖ కార్యాలయం శనివారం ప్రకటించింది.

Agnipath scheme: అగ్నిపథ్ ఆందోళనలతో వెనక్కు తగ్గిన కేంద్రం, కీలక నిర్ణయం ప్రకటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా..
Amit Shah reaches Kolkata amid black flag protest by Left, Cong (Photo-ANI)

అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా యువత భగ్గుమనడంతో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. అగ్నివీరులుగా పనిచేసిన వారికి కేంద్ర సాయుధ బలగాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని హోంశాఖ కార్యాలయం శనివారం ప్రకటించింది. 'అగ్నిపథ్' కింద ఆర్మీకి ఎంపికై నాలుగేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి.. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సామ్ రైఫిల్స్‌లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని వెల్లడించింది. ఈ రెండు దళాల్లో నియామకాల్లో గరిష్ట వయో పరిమితిని అగ్నివీరులకు 3 ఏళ్ల పాటు పెంచుతామని కేంద్రం తెలిపింది. అగ్నివీర్ తొలి బ్యాచ్ వారికి .. కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లో గరిష్ట వయో పరిమితి 5 ఏళ్లు సడలింపు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 18, 2022 10:13 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).