Anand Mahindra Tweet: నేను, నా కంపెనీ ఇంకా అలా ఎదగలేదురా బాబు, వైరల్ వీడియో ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా, ట్రక్ డిజైనింగ్‌లో ఇది భాగం కాదని విష్యత్‌లోనూ దీన్నెప్పటికీ భాగం చేయమంటూ స్పష్టత
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోతో షేర్ చేయడంతో పాటు ‘‘నేను, నా కంపెనీ ఇంకా ఇంత ఎదగలేదురా బాబు.. భవిష్యత్తులో కూడా ఇలాంటి పనులు చేయనని ఆనంద్ మహీంద్రా అంటున్నారు. ట్వీట్టర్లో షేర్ చేసిన వీడియోలో (Anand Mahindra Tweet) ముందు ఓ పికప్ ట్రక్కు కనిపిస్తుంది. పోలీసులు ట్రక్కు కింద భాగంలో అమర్చిన డ్రాను బయటకు లాగారు. బయటకు కనిపించకుండా అమర్చిన డ్రాలో (Video of Secret Liquor Drawer) వందల సంఖ్యలో మద్యం బాటిళ్లు, కార్టన్లు దర్శనమిచ్చాయి. ఈ వీడియో చూసిన వారంతా వీరి అతి తెలివికి కళ్లు తేలేస్తారు.
దీనిపై ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) స్పందిస్తూ.. తమ పికప్ ట్రక్ డిజైనింగ్‌లో ఇది భాగం కాదని.. భవిష్యత్‌లోనూ దీన్నెప్పటికీ భాగం చేయమంటూ స్పష్టత ఇచ్చారు. ‘ తెలివైనవాడు. సరుకు రవాణాకు కొత్త అర్థం ఇచ్చాడు! మా పరిశోధనా కేంద్రంలో పికప్ ట్రక్ డిజైనింగ్ మార్పుల్లో ఈ ఆలోచనకు తావు లేదు. ఎప్పటికీ ఉండదు’ అంటూ దాన్ని ఉపయోగించిన తీరును మహీంద్రా వ్యతిరేకించారు.
Here's anand mahindra Share Video
Diabolically clever. Gives a whole new meaning to the word ‘Payload!’ But I assure you this kind of innovation was not part of the design brief for the pickup truck Product Development team at our research centre, nor will it EVER be! 😊 pic.twitter.com/JMqZN0VDAx
— anand mahindra (@anandmahindra) March 19, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 24, 2021 04:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

