Ganesh Chaturthi 2022: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నట్లు ట్వీట్

వినాయక చవితి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు.

Ganesh Chaturthi 2022: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నట్లు ట్వీట్
Andhra Pradesh CM YS Jagan Mohan Reddy (Photo-Twitter)

వినాయక చవితి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. గణనాథుని కరుణాకటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో అభివృద్ధి చెందాలని ఆయన అభిలషించారు. విజ్ఞానం, వినయం, సకల శుభాలకు ప్రతీక గణనాథుడు. విఘ్నాలను తొలగించి అభీష్టాలను నెరవేర్చే పూజ్యుడు విఘ్నేశ్వరుడు. ఆయన చల్లని ఆశీస్సులతో ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని, ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ.. మీఅందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 31, 2022 10:52 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).