గుజరాత్ రాష్ట్రంలో గల థర్మాక్స్ కంపెనీలో పది ఖాళీల గురించి తెలుసుకున్న తర్వాత వేలాది మంది నిరుద్యోగులు క్యూ కట్టారు. బరూచ్‌లోని అంక్లేశ్వర్‌లోని లార్డ్స్ ప్లాజా హోటల్‌లో ఇంటర్యూ కోసం యువ ఉద్యోగార్ధులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. అధిక సంఖ్యలో దరఖాస్తుదారులు రావడంతో అక్కడ పరిస్థితి కిక్కిరిసిపోయింది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భారతదేశంలో 'నిరుద్యోగ వ్యాధి' ఒక అంటువ్యాధి రూపాన్ని సంతరించుకుంది. బిజెపి పాలిత రాష్ట్రాలు ఈ వ్యాధికి 'కేంద్రంగా' మారాయి. ఉమ్మడి ఉద్యోగం కోసం క్యూలలో నిలబడిన 'భారత భవిష్యత్తు' నరేంద్ర మోడీ 'అమృత్ కాల్' యొక్క వాస్తవికత అంటూ కొటేషన్ ఇచ్చారు. షాకింగ్ వీడియో ఇదిగో, కేవలం 10 ఉద్యోగాల కోసం ఎగబడ్డ వేలాదిమంది యువకులు, గుజరాత్‌లో నిరుద్యోగానికి ఇది నిదర్శనమంటున్న నెటిజన్లు

Here's Rahul Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)