Mumbai Car Accident: ముంబైలోని బాంద్రాలో కారు బీభత్సం.. ముగ్గురు మృతి.. ఆరుగురికి తీవ్రంగా గాయాలు
ముంబైలోని బాంద్రాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. గురువారం రాత్రి వర్లీ నుంచి బాంద్రా వైపు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి టోల్ ప్లాజా వద్ద నిలిపిఉంచిన పలు కార్లను ఢీకొట్టింది.
Mumbai, Nov 10: ముంబైలోని (Mumbai) బాంద్రాలో (Bandra) ఓ కారు బీభత్సం సృష్టించింది. గురువారం రాత్రి వర్లీ నుంచి బాంద్రా వైపు వెళ్తున్న ఓ కారు (Speeding car) అదుపుతప్పి టోల్ ప్లాజా వద్ద నిలిపిఉంచిన పలు కార్లను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. సీ లింక్ లో టోల్ ప్లాజాకు 100 మీటర్ల సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు తొలుత మెర్సిడెస్ బెంజ్ కారును ఢీకొట్టింది. అప్పటికీ ఆగకుండా మరో నాలుగు వాహనాలను ఢీకొట్టిందని డీసీపీ కృష్ణకాంత్ ఉపాధ్యాయ్ (DCP Krishnakant Upadhyay) తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
3 killed, several injured after speeding car hits vehicles at #Mumbai's Bandra-Worli Sea Linkhttps://t.co/PnEOGM334c pic.twitter.com/q6VU47owhC
— Hindustan Times (@htTweets) November 10, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 10, 2023 08:44 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

