Kerala: షాకింగ్ వీడియో, మైనర్ బాలికపై 30 ఏళ్ల వ్యక్తి దారుణం, ఏ కారణం లేకుండానే ఆమెను పైకి ఎత్తి ఒక్కసారిగా నేలపై పడేసిన కేరళ వాసి
కేరళలో మైనర్ బాలికపై 30 ఏళ్ల ఓ వ్యక్తి క్రూరంగా ప్రవర్తించాడు. కాసర్‌గడ్ జిల్లాలోని మంజేశ్వర్‌లో ఏ కారణం లేకుండానే తొమ్మిదేళ్ల విద్యార్థిని అమాంతం ఎత్తి కిందపడేశాడు. ఆయిరం జుమా మసీదు సమీపంలో చిన్నారి బుర్ఖా ధరించి నిలబడి ఉంది.
కేరళలో మైనర్ బాలికపై 30 ఏళ్ల ఓ వ్యక్తి క్రూరంగా ప్రవర్తించాడు. కాసర్‌గడ్ జిల్లాలోని మంజేశ్వర్‌లో ఏ కారణం లేకుండానే తొమ్మిదేళ్ల విద్యార్థిని అమాంతం ఎత్తి కిందపడేశాడు. ఆయిరం జుమా మసీదు సమీపంలో చిన్నారి బుర్ఖా ధరించి నిలబడి ఉంది. ఇంతలో బాలిక వైపు కోపంగా వచ్చిన వ్యక్తి ఆమెను ఎత్తి ఒక్కసారిగా నేలపై పడేశాడు. అనంతరం అక్కడి నుంచి మళ్లీ తన దారిన తను వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.నిందితుడు ఉధ్యవరం నివాసి అబూబకర్ సిద్దిక్ (30)గా గుర్తించారు.
#CCTV: A 9-year-old #girl was thrown away by a man in #Kerala's #Kasargod.
A girl #student was lifted and thrown on the ground without any reason near #Manjeshwar of Kasaragod. #Kerala pic.twitter.com/090DZ6qgNx
— Harish Deshmukh (@DeshmukhHarish9) November 18, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 18, 2022 09:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

