Gurugram Shocker: షాకింగ్ వీడియో, ప్రాణాలు కాపాడితే ఆ సెక్యూరిటీ గార్డునే చితకబాదాడు, సీసీ టీవీ కెమెరాలో రికార్డయిన పుటేజీ
ఎవరైనా అపాయంలో చిక్కుకున్నప్పుడు రక్షించిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పడం చాలా సర్వసాధారణమైన విషయం. కానీ గురుగ్రామ్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం ప్రాణాపాయం నుంచి బయటపడగానే తనను రక్షించిన సెక్యూరిటీగార్డుపై చిందులేశాడు.
ఎవరైనా అపాయంలో చిక్కుకున్నప్పుడు రక్షించిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పడం చాలా సర్వసాధారణమైన విషయం. కానీ గురుగ్రామ్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం ప్రాణాపాయం నుంచి బయటపడగానే తనను రక్షించిన సెక్యూరిటీగార్డుపై చిందులేశాడు. అతని చెంపలు చెడామడా వాయించాడు. ఇదంతా అక్కడి సీసీ టీవీ కెమెరాలో రికార్డయింది. పోలీసులు అతడిపై కేసులు నమోదు చేశారు.
గురుగ్రామ్‌లోని క్లోజ్ నార్త్ సొసైటీకి చెందిన వరుణ్ నాథ్ తానుంటున్న అపార్ట్‌మెంట్‌లోని 14వ అంతస్తు నుంచి కిందికి వస్తున్నాడు. ఈ క్రమంలో లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో లిఫ్ట్‌లో అమర్చిన ఇంటర్‌కమ్ ద్వారా సెక్యూరిటీగార్డు అశోక్‌కు సమాచారం అందించాడు. దీంతో లిఫ్ట్‌మ్యాన్‌ను అక్కడికి తీసుకెళ్లిన అశోక్ సమస్యను సరిదిద్దాడు.
ఇందుకు ఐదు నిమిషాలు పట్టింది. మొత్తానికి లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన వరుణ్ నాథ్ ఆ వెంటనే ఆగ్రహంతో ఊగిపోతూ సెక్యూరిటీ గార్డుపై చిందులేశాడు. అతడి చెంపలు చెడామడా వాయించాడు. అంతేకాదు, ఆ తర్వాత లిఫ్ట్‌మ్యాన్‌పైనా దాడిచేసి చెంపలు వాయించాడు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.
రెసిడెంట్ చేయి చేసుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సొసైటీలోని సెక్యూరిటీ గార్డులు ఆందోళనకు దిగారు.వరుణ్‌పై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. సెక్యూరిటీగార్డుల ఫిర్యాదుతో వరుణ్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
How much punishment for this piece of shit? He was stuck in the lift in Gurugram's The Close North Nirvana Country colony. Watch what he does when he gets out. His name is Varun Nath. Police complaint filed. Least he deserves is the same treatment: https://t.co/okwhEQ9bip pic.twitter.com/uLYyKAzeUd
— Shiv Aroor (@ShivAroor) August 29, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 30, 2022 11:43 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

