Karnataka: తాళి కట్టే సమయంలో వధువు షాక్, నా ప్రియుడుతోనే మూడు ముళ్లు వేయించుకుంటానంటూ పట్టు, ఒక్కసారిగా షాక్ తిన్న వరుడు
రెండు నిమిషాల్లో వరుడు తాళి కట్టాల్సిన సమయంలో వధువు పెళ్లి వద్దని కళ్లు తిరిగి పడిపోయినట్లుగా యాక్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది.ఈ విడ్డూరం మైసూరు నగరంలోని విద్యాభారతి కళ్యాణ మండపంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హెచ్‌డీ కోటెకు చెందిన యువకునితో మైసూరుకు చెందిన సించన అనే యువతికి పెద్దలు ఇటీవలే నిశ్చితార్థం చేశారు. కాగా, పెళ్లి వేడుకలో వధువు అడ్డం తిరిగింది. ఈ పెళ్లి ఎంతమాత్రం ఇష్టం లేదని, తాను ఇంటి పక్కన ఉన్న యువకున్ని ప్రేమించానని, అతనితోనే మూడుముళ్లు వేసుకుంటానని చెప్పడంతో వధూవరుల తల్లిదండ్రులు ఒక్కసారిగా షాకయ్యారు.
ఇప్పుడు పెళ్లి వద్దంటే ఎలా?, తాము ఈ పెళ్లి కోసం రూ. 5 లక్షలకు పైగా ఖర్చు చేశామని, తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని పెళ్లకొడుకు తల్లిదండ్రులు పట్టుబట్టారు. దీంతో, స్థానిక పోలీసులు వచ్చి వధువుకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు. దీంతో వధూవరులను పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఎవరు చెప్పినా వినేది లేదని, ప్రేమించినవాడినే పెళ్లి చేసుకుంటానని పెళ్లికూతురు భీష్మించడంతో ఖాకీలు సైతం ఏమీ చేయలేకపోయారు.
Bride refuses to marry at the last minute- says 'No' to the groom on the wedding day, and leaves the marriage hall with police protection. The incident happened at #Mysuru #Karnataka.@KeypadGuerilla Video pic.twitter.com/wlwc0bZ2qO
— Siraj Noorani (@sirajnoorani) May 22, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 23, 2022 01:10 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

