Patna, May 26: ఓ పాఠశాల మహిళా ప్రిన్సిపాల్ (School Principal), టీచర్ (Teacher) తలపడ్డారు. ఇద్దరూ కలబడి కిందపడి కొట్టుకున్నారు. చెప్పులకు (Chappal) కూడా పనిచెప్పారు. టీచర్, ప్రిన్సిపాల్ తలపడుతుంటే విద్యార్థులందరూ (Students) చుట్టూ చేరి వినోదం చూశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. బీహార్‌లోని పాట్నా జిల్లా కౌరియా పంచాయతీలోని బిహ్తా మిడిల్ స్కూల్‌లో జరిగిందీ ఘటన. తొలుత తరగతి గదిలో టీచర్, ప్రిన్సిపాల్ మధ్య వాగ్వివాదం జరిగింది. ఆ తర్వాత ఇద్దరూ బయటకొచ్చి కలబడ్డారు.  వారిని ప్రిన్సిపాల్ కాంతి కుమారి, టీచర్ అనితా కుమారిగా గుర్తించారు. వ్యక్తిగత వైరంతోనే వారు కొట్టుకున్నట్టు తెలుస్తోంది. వారిద్దరికీ నోటీసులు ఇచ్చినట్టు విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు.

Cough Syrup Export New Rule: ప్రభుత్వ ల్యాబ్‌లు పరీక్షించి అనుమతించిన తర్వాతనే ఎగుమతులు.. దగ్గు మందులపై డీజీఎఫ్‌టీ నిబంధనలు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)