Andhra Pradesh Horror: కడపలో దారుణం, భార్య, కుమార్తెను కొడవలితో నరికి చంపిన భర్త, అనంతరం నా భార్యను చంపేశానంటూ సమాధానం..
కడప జిల్లా తొండూరు మండలం తేలూరు తుమ్మలపల్లె గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య, కుమార్తెను కొడవలితో నరికి చంపాడు భర్త గంగాధర్, అతను మతిస్థిమితం లేక భార్య, కుమార్తెను భర్త హత్య చేశారు
కడప జిల్లా తొండూరు మండలం తేలూరు తుమ్మలపల్లె గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య, కుమార్తెను కొడవలితో నరికి చంపాడు భర్త గంగాధర్, అతను మతిస్థిమితం లేక భార్య, కుమార్తెను భర్త హత్య చేశారు. తొండూరు మండలం తుమ్మల పల్లెకు చెందిన శ్రీలక్ష్మి అంగన్వాడి కేంద్రంలో సహాయకురాలిగా పనిచేస్తుంది. కుమార్తె గంగోత్రి ఎనిమిదో తరగతి చదువుతుంది.
భర్త గంగాధర్‌కు మతిస్థిమితం లేదు, ఎప్పుడు మద్యం తాగుతూ ఉండేవాడు. సోమవారం రాత్రి భార్య, కుమార్తె నిద్రిస్తున్న సమయంలో కొడవలితో వారిపై దాడి చేసి హత్య చేశాడు. మంగళవారం శ్రీలక్ష్మి విధిలోకి రాకపోవడంతో అంగన్వాడి కార్యకర్త చరవాణి ద్వారా ప్రయత్నించారు. సమయంలో భర్త గంగాధర్ రెడ్డి ఫోన్ ఎత్తి నా భార్యను చంపేశానంటూ సమాధానం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గొంతు కోసిన ‘చైనా మాంజ’.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఘటన (వీడియో)
Man killed wife and daughter with knife
భార్య, కుమార్తెను కొడవలితో నరికి చంపిన గంగాధర్
👉రెడ్డి కడప జిల్లా తొండూరు మండలం తేలూరు తుమ్మలపల్లె గ్రామంలో దారుణం.
👉పరారీలో నిందితుడు గంగాధర్ రెడ్డి. మృతులు తుమ్మల శ్రీలక్ష్మి (37), తుమ్మల గంగోత్రి(14)గా గుర్తింపు.
👉నిందితుడు గంగాధర్ రెడ్డి కోసం పోలీసుల గాలింపు. pic.twitter.com/EjqhEr734e
— ChotaNews App (@ChotaNewsApp) January 7, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 07, 2025 03:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

