Andhra Pradesh:అచ్యుతాపురం సెజ్‌లో భారీ పేలుడు, బయటకు పరుగులు తీసిన కార్మికులు, ఒకరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు
ఏపీలో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్)లో భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఏపీలో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్)లో భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. లాలంకోడూరు సమీపంలోని జీఎఫ్‌ఎంఎస్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో.. భయాందోళనకు గురైన కార్మికులు అక్కడ నుంచి పరుగులు తీశారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కర్మాగారంలో ఉన్న కార్మికులను బయటకు పంపించారు. ప్రమాదానికి గల కారణాలు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అగ్నిమాపక అధికారులు విచారణ ప్రారంభించారు. కంపెనీ ప్రతినిధుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
Here's Video
అనకాపల్లి జిల్లా
అచ్యుతాపురం ఎస్ఈజడ్ లో జీఎఫ్‌ఎంఎస్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు
కంపెనీ రియాక్టర్ పేలడంతో పరుగులు తీసిన కార్మికులు pic.twitter.com/gk8c60GAt9
— Mayabazar TV (@mbtvtelugu) January 31, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 31, 2023 03:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

