Ambati Rambabu vs Nagababu: నాగబాబుకు పంచ్ రిప్లై ఇచ్చిన అంబటి రాంబాబు, పోలవరం పూర్తి చేసి మీ అన్నాదమ్ముళ్ల చేత డ్యాన్స్ వేయిస్తామంటూ ట్వీట్
నాగబాబు సెటైర్ పట్ల అంబటి కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించారు. 'నువ్వు, నీ తమ్ముడు అన్నట్టు నేను సంబరాల రాంబాబునే. కానీ ముఖానికి రంగు వేయను. ప్యాకేజీ కోసం డ్యాన్స్ చేయను' అని వ్యాఖ్యానించారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో భోగి వేడుకల సందర్భంగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు.. బంజారా మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా అంబటి సరదాగా గడిపారు. తాను డ్యాన్స్ చేసిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు.
మరోవైపు అంబటి పోస్టుపై జనసేన నేత, సినీ నటుడు నాగబాబు స్పందించారు. 'సంబరాల రాంబాబు గారు మీరు డ్యాన్స్ మహత్తరంగా చేశారు. పోలవరం పూర్తి చేసి డ్యాన్స్ చేసి ఉంటే ఇంకా మహత్తరంగా ఉండేది' అని ఎద్దేవా చేశారు. నాగబాబు సెటైర్ పట్ల అంబటి కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించారు. 'నువ్వు, నీ తమ్ముడు అన్నట్టు నేను సంబరాల రాంబాబునే. కానీ ముఖానికి రంగు వేయను. ప్యాకేజీ కోసం డ్యాన్స్ చేయను' అని వ్యాఖ్యానించారు.
Here's Tweets
పోలవరం మేమే పూర్తి చేస్తాం !
చంద్రబాబు,పవన్ బాబు,నాగబాబుతో
డాన్స్ చేయిస్తాం !@NagaBabuOffl@PawanKalyan @ncbn
— Ambati Rambabu (@AmbatiRambabu) January 16, 2023
నువ్వు, మీతమ్ముడు అన్నట్టు
"సంబరాల రాంబాబు"నే !
కానీ...ముఖానికి రంగు వేయను
ప్యాకేజి కోసం డాన్స్ చేయను ! @NagaBabuOffl@PawanKalyan
— Ambati Rambabu (@AmbatiRambabu) January 16, 2023
భోగి,సంక్రాంతి శుభాకాంక్షలు! pic.twitter.com/nWj2ZaLPDN
— Ambati Rambabu (@AmbatiRambabu) January 14, 2023
Here's Nagababu Tweet
సంబరాల రాంబాబు గారు మీరు డ్యాన్స్ మహత్తరంగా చేసారు... పోలవరం పూర్తి చేసి డ్యాన్స్ చేసి వుంటే ఇంకా మహత్తరంగా వుండేది ! https://t.co/p7maOu77If
— Naga Babu Konidela (@NagaBabuOffl) January 15, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 16, 2023 03:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

