Corona in AP: ఏపీలో కొత్తగా 332 మందికి కరోనా, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 55 కొత్త కేసులు నమోదు, అత్యల్పంగా విజయనగరం, కర్నూలు జిల్లాలలో 3 కేసులు

ఏపీలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల వ్యవధిలో 29,243 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 332 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

Corona in AP: ఏపీలో కొత్తగా 332 మందికి కరోనా, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 55 కొత్త కేసులు నమోదు, అత్యల్పంగా విజయనగరం, కర్నూలు జిల్లాలలో 3 కేసులు
Coronavirus Outbreak (Photo credits: IANS)

ఏపీలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల వ్యవధిలో 29,243 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 332 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 55 కొత్త కేసులు నమోదు కాగా, కడప జిల్లాలో 43, గుంటూరు జిల్లాలో 42 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం, కర్నూలు జిల్లాలలో 3 కేసుల చొప్పున గుర్తించారు. అదే సమయంలో 585 మంది కోలుకోగా, ఏడుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,302కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,60,040 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,39,545 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,193 మంది చికిత్స పొందుతున్నారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 17, 2021 10:49 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).