CM YS Jagan Tirumala Tour: పంచకట్టుతో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఏపీ సీఎం వైఎస్ జగన్, పద్మావతి చిన్న పిల్లల కార్డియాక్‌ సెంటర్‌ ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి

పంచకట్టుతో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఏపీ సీఎం వైఎస్ జగన్

CM YS Jagan Tirumala Tour: పంచకట్టుతో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఏపీ సీఎం వైఎస్ జగన్, పద్మావతి చిన్న పిల్లల కార్డియాక్‌ సెంటర్‌ ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి
CM YS Jagan Tirumala Tour (Photo-Video Grab)

తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దర్శించుకున్నారు. సాంప్రదాయ పంచకట్టుతో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు. టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సీఎంకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం 2022 టీటీడీ క్యాలెండర్‌, డైరీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు. అనంతరం గరుడ వాహన సేవలో సీఎం పాల్గొన్నారు. తిరుపతి, తిరుమలలో పర్యటిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌.. పలు అభివృద్ధి కార్యక్రమాలను సోమవారం ఆయన ప్రారంభించారు.

ముందుగా తిరుపతి బర్డ్‌ ఆసుపత్రిలో శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్‌ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం అలిపిరి వద్దకు చేరుకున్న సీఎం జగన్‌.. శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడక మార్గం, పై కప్పును, గోమందిరాన్ని ప్రారంభించారు. అక్కడ నుంచి తిరుమల చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌కు పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో, మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం బేడి ఆంజనేయ స్వామిని సీఎం దర్శించుకున్నారు.

CM YS Jagan Tirumala Tour

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 11, 2021 07:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).