AP MPTC & ZPTC Elections 2021: ఏపీలో కొనసాగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్ , ఓటు వేయడానికి తరలివస్తున్న ఓటర్లు, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్, 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటర్లు మాస్క్ ధరించి ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలివస్తున్నారు. 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 2గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. కోవిడ్ నేపథ్యంలో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
జెడ్పీటీసీ ఎన్నికల బరిలో 2,058 మంది అభ్యర్థులు, ఎంపీటీసీ ఎన్నికల బరిలో 18,782 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పరిషత్ ఎన్నికల కోసం 27,751 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. పరిషల్ ఎన్నికల పోలింగ్‌లో 2,46,71,002 మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
Vijayawada City – On 08.04.2021, On Orders of Sri B. Sreenivasulu IPS, Commissioner of Police, Sri Vijay Paul ACP (East Zone) visited Polling stations in Gudavalli and Velpuru villages within the limits of East Zone. @APPOLICE100 @dgpapofficial pic.twitter.com/rtNDPN36Ql
— Vijayawada City Police (@VjaCityPolice) April 8, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 08, 2021 08:01 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

