ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్‌ పదవి కోసం ఒకే ఒక నామినేషన్‌ రావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. టీడీపీలో సీనియర్‌ నేతగా కొనసాగుతున్న అయ్యన్న.. కూటమి ఎమ్మెల్యేల్లో అత్యంత సీనియర్‌. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ పెట్టిన ఏడాది 1983లో తొలిసారి నర్సీపట్నం నుంచి విజయం సాధించారు. ఇప్పటి వరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి అనకాపల్లి ఎంపీగానూ విజయం సాధించారు. పలుశాఖలకు మంత్రిగా పనిచేశారు. గతంలో కంటే ఈసారి 24,756 ఓట్ల మెజార్టీతో నర్సీపట్నం ప్రజలు గెలిపించారు.  ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్.. సభ్యులతో ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్ (వీడియోలతో)

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)